జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ
- ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి
- జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్
- కేటీఆర్‌కు స్వాగతం పలకనున్న బీఆర్ఎస్ శ్రేణులు
కేటీఆర్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో జగిత్యాల శివారులో బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వారు జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఈ సమయంలో కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది.