Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యారెడ్డి నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!

Bellamkonda Sreenivas Engagement with Kavya Reddy Photos
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో శ్రీనివాస్, కావ్య ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, తల్లి పద్మ, సోదరుడు గణేశ్ బాబు పాల్గొన్నారు. గత మార్చి నెలలోనే వీరి రోకా వేడుక జరగ్గా, అది కేవలం కుటుంబ ప్రకటన మాత్రమేనని, అసలైన వేడుకలు ముందున్నాయని అప్పట్లో శ్రీనివాస్ స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే ఇప్పుడు అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

కావ్యారెడ్డి సినీ పరిశ్రమకు చెందినవారు కాదు. ఆమె హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అని సమాచారం. వీరి వివాహం ఈ నెల 29 లేదా 30న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మే 1వ తేదీన హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Go Back to Shorts
Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas engagement
Kavya Reddy
Bellamkonda Suresh
Tollywood wedding
Hyderabad engagement photos
Telugu cinema news
Tirumala wedding
Bellamkonda Ganesh Babu
Celebrity weddings

More Telugu News