Nara Lokesh: నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం

Nara Lokesh to Meet PM Modi Today
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.

ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా లోకేశ్ కలవనున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులతోనూ ఆయన సమావేశమవుతారు. అలాగే, రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కూడా మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని లోకేశ్ రాజ్యసభ గ్యాలరీ నుంచి లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.  
Go Back to Shorts
Nara Lokesh
AP Minister
Narendra Modi
Amit Shah
Amaravati Bill
Andhra Pradesh Reorganisation Bill
Rajya Sabha
Delhi Visit
Central Government
AP Politics

More Telugu News