Abhishek Sharma: ఫామ్‌లో లేకున్నా అభిషేక్‌కే ఛాన్స్.. ఫైనల్లో రిస్క్ చేస్తున్న టీమిండియా?
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు అభిషేక్ శర్మ ఫామ్ పై ఆందోళన
- గత ఆరు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన యువ ఓపెనర్
- అనారోగ్యం, ప్రత్యర్థుల వ్యూహాలతో ఇబ్బంది పడుతున్న అభిషేక్
- విన్నింగ్ కాంబినేషన్ మార్చకూడదని భావిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్
- ఫైనల్లోనూ అభిషేక్‌కే అవకాశం ఇవ్వాలని నిర్ణయం
టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి ముందు టీమిండియాను ఒక కీలక సమస్య వేధిస్తోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారాయి. అయితే, ఫామ్‌తో సంబంధం లేకుండా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న తుదిపోరులోనూ అతడికే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. విన్నింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు సుముఖంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ టోర్నమెంట్ ఆరంభంలో అంచనాలు వేరేగా ఉన్నాయి. అభిషేక్ శర్మ జట్టుకు కీలకంగా మారతాడని, సంజూ శాంసన్ ప్రదర్శనపైనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, టోర్నీ కీలక దశకు చేరుకునేసరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సంజూ శాంసన్ నిలకడైన ప్రదర్శనతో విమర్శలకు సమాధానం చెప్పగా, అభిషేక్ శర్మ ఫామ్ పూర్తిగా పక్కదారి పట్టింది. గత ఆరు మ్యాచుల్లో 0, 0, 0, 15, 10, 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. జింబాబ్వేపై చేసిన అర్ధశతకం మినహా ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు.
అభిషేక్ ఫామ్ కోల్పోవడానికి శారీరక ఇబ్బందులు కూడా ఒక కారణం. లీగ్ దశ తర్వాత కడుపు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రి పాలైన అభిషేక్, గణనీయంగా బరువు తగ్గడంతో తన లయను కోల్పోయాడు. ఇదే సమయంలో ప్రత్యర్థి జట్లు కూడా అతడి బలహీనతలను పసిగట్టాయి. పవర్‌ప్లేలో పేస్ బౌలింగ్‌ను ఇష్టపడే అభిషేక్‌కు స్పిన్నర్లను ప్రయోగించి కట్టడి చేస్తున్నాయి. ఆఫ్ స్పిన్నర్లు, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లతో అతడిని పరుగులు చేయకుండా నిలువరిస్తున్నాయి. పేస్ లేని బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ, షాట్లకు తొందరపడి వికెట్ సమర్పించుకుంటున్నాడు.
అతడి స్థానంలో రింకూ సింగ్‌ను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అది జట్టు కూర్పును దెబ్బతీస్తుందని యాజమాన్యం భావిస్తోంది. ఓపెనర్‌గా కాకుండా రింకూను తీసుకుంటే, అతను 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ దూకుడైన ఆటతీరుపై నమ్మకం ఉంచి, ఫైనల్లోనూ అతడికే మద్దతుగా నిలవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. "అభిషేక్‌పై జీజీ భాయ్ (గంభీర్), సూర్య లకు చాలా నమ్మకం ఉంది. మేం మా ఆటగాళ్లందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం" అని సెమీస్ అనంతరం సంజూ శాంసన్ చెప్పిన మాటలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.