Nara Lokesh: టీమిండియా... అదరగొట్టేశావ్!: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
- ముంబై వేదికగా జరిగిన సెమీస్ లో 7 పరుగుల తేడాతో గెలుపు
- ఇంగ్లండ్‌పై విజయం సమష్టి కృషికి నిదర్శనమని సీఎం ప్రశంస
శాంసన్, దూబే ఆటతీరు అద్భుతమన్న మంత్రి నారా లోకేశ్ - కప్పు గెలవాలని ఆకాంక్షిస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ అపురూప విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.
"వాట్ ఏ మ్యాచ్.. ఇదొక అద్భుతమైన విజయం" అంటూ చంద్రబాబు కొనియాడారు. ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టడంపై జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సంజు శాంసన్, శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్ బ్రలియంట్ అని, జస్ప్రీత్ బమ్రా, హార్దిక్ పాండ్యా బౌలింగ్ పటిమ, అక్షర్ పటేల్ మెరుపు ఫీల్డింగ్ అద్భుతమని ప్రశంసించారు. ఇదొక పూర్తి స్థాయి జట్టు ప్రదర్శన అని పేర్కొన్న చంద్రబాబు.. ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా టీమిండియా విజయంపై స్పందించారు. ఇదొక చిరస్మరణీయ విజయమని, సంజు శాంసన్, శివమ్ దూబేల విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలిపిన లోకేశ్.. దేశం మొత్తం మీ వెంటే ఉందని, ఫైనల్లో గెలిచి కప్పును ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించారు. వాంఖెడేలో జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలుపుతో భారత అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి