Nandamuri Balakrishna: హిందూపురంలో సొంత ఇంటి నిర్మాణానికి బాలకృష్ణ భూమి పూజ
- వనం కాలనీలో 81 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం
- పూజా కార్యక్రమంలో అర్ధాంగి వసుంధరతో కలిసి పాల్గొన్న బాలయ్య
- ఇకపై హిందూపురమే తన కేరాఫ్ అడ్రస్ అని వెల్లడి
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వనం కాలనీలో శుక్రవారం ఆయన సతీమణి వసుంధరతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఆయన హిందూపురంలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు స్పష్టమైంది.
హిందూపురం నుంచి 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ, ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. దీంతో, ఆయన నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం లేదంటూ ప్రతిపక్షాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
హిందూపురం పట్టణ సమీపంలోని వనం కాలనీలో 81 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. భూమిపూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా, ఇకపై హిందూపురమే తన కేరాఫ్ అడ్రస్ అవుతుందని బాలకృష్ణ తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. సొంత ఇంటి నిర్మాణంతో నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కావాలని, వారితో మమేకం కావాలని ఆయన భావిస్తున్నారు.