Chandrababu Naidu: నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్

Chandrababu Naidu AP Govt Announces Free Electricity for Weavers
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యజమానులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఆ హామీకి అనుగుణంగా అర్హులైన నేత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ‘నేతన్నల ఉచిత విద్యుత్’ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో వేలాది చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుంది. ఈ నిర్ణయంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేతన్నల కుటుంబాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 
 
Go Back to Shorts
Chandrababu Naidu
AP Government
Andhra Pradesh
Weavers
Free Electricity
Handloom Weavers
Powerloom Weavers
AP Budget
Savitha
Textile Industry

More Telugu News