Chandrababu Naidu: శివతత్వ చీరలు ధరించి సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు... ఫొటోలు ఇవిగో!

Women Legislators Meet CM Chandrababu Wearing Shiva Tattva Sarees
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఒకే రకమైన వస్త్రధారణతో అసెంబ్లీకి విచ్చేసిన మహిళా ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్. సవితతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళా నేతలు ఈ విధంగా ప్రత్యేకతను చాటడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం, అసెంబ్లీ లాబీల్లో ఈ మహిళా ప్రజాప్రతినిధులు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను కూడా కలిసి మాట్లాడారు. దీంతో శాసనసభ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh Assembly
Budget Session
Shiva Tattva Sarees
Women Legislators
Maha Shivaratri
Vangalapudi Anitha
Gummidi Sandhyarani
Chintakayala Ayyanna Patrudu
Nandamuri Balakrishna

More Telugu News