Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు

Andhra Pradesh Budget 2024 Prayers Offered at Kanaka Durga Temple
  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
  • ఇంద్రకీలాద్రిలో బడ్జెట్ ప్రతులకు వేద పండితులతో పూజలు
  • బడ్జెట్ రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను అమ్మవారి పాదాల చెంత ఉంచి వేద పండితులతో పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి బడ్జెట్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు.


ఆ తర్వాత, బడ్జెట్ ప్రతులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు అందజేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్నారు.


ఈ బడ్జెట్ సుమారు రూ.3.46 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బడ్జెట్ ప్రజలందరికీ మేలు చేకూర్చాలని అధికారులు అమ్మవారిని ప్రార్థించడం గమనార్హం.

Andhra Pradesh Budget
AP Budget 2024
Payyavula Keshav
Chandrababu Naidu
Kanaka Durga Temple
Vijayawada
AP Assembly
Andhra Pradesh Economy

More Telugu News