Bandla Ganesh: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన బండ్ల గణేశ్

Bandla Ganesh Meets Minister Nara Lokesh
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురువారం రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా, ఇటీవల తాను పూర్తి చేసిన 'సంకల్ప పాదయాత్ర' గురించి మంత్రికి బండ్ల గణేశ్ వివరంగా తెలిపారు.

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు 535 కిలోమీటర్ల పాటు 23 రోజుల పాటు సాగిన తన పాదయాత్ర అనుభవాలను, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని లోకేశ్‌తో పంచుకున్నారు. అనంతరం, శ్రీవారి దర్శనం తర్వాత స్వీకరించిన తీర్థ ప్రసాదాన్ని లోకేశ్‌కు అందజేశారు. ఇరువురు నేతలు పలు అంశాలపై హృద్యంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది.

అంతకుముందు బండ్ల గణేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికే ఈ పాదయాత్ర చేపట్టానని బండ్ల గణేశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను ఆత్మీయంగా పలకరించి, పాదయాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. బండ్ల గణేశ్ అందించిన తిరుమల ప్రసాదాన్ని స్వీకరించారు. 
Go Back to Shorts
Bandla Ganesh
Nara Lokesh
Chandrababu Naidu
Sankalpa Padayatra
TDP
Andhra Pradesh Politics
Tirumala
AP Assembly
Telugu Cinema
Political Meeting

More Telugu News