India Pakistan match: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. కొలంబోకు మూడింతలు పెరిగిన విమాన టిక్కెట్ ధరలు

India Pakistan Match Colombo Flight Ticket Prices Triple
  • ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • ఢిల్లీ నుంచి కొలంబోకు రూ.90,000కు పెరిగిన ఛార్జీలు
  • ఢిల్లీ నుంచి రూ.2,25,000కు పెరిగిన బిజినెస్ క్లాస్ ఛార్జీ
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని రెండు రోజుల క్రితం పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో కొలంబోకు విమాన టిక్కెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముంబై-కొలంబో-ముంబై విమాన టిక్కెట్ ధర నిన్న ఉదయం రూ.60,000గా ఉండగా, ఈరోజు మరింత పెరిగింది.

ముంబై నుంచి కొలంబోకు ఎకానమీ టిక్కెట్ ధర రూ.60,000 ఉండగా, ప్రీమియం ఎకానమీ ధర రూ.84,000గా ఉంది. శ్రీలంక ఎయిర్ లైన్స్‌లో ముంబై-కొలంబో విమానం టిక్కెట్ ధర రూ.63,340, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,34,157గా ఉంది.

సాధారణంగా ఢిల్లీ-కొలంబో టిక్కెట్ ధర రూ.30,000 ఉండగా, ఇప్పుడు రూ.90,000కు చేరుకుంది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు రూ.1,92,000 నుంచి రూ.2,25,000 వరకు పలుకుతున్నాయి.

మొదట భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పలు దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించి ఉత్కంఠకు తెరదించింది. దీంతో శ్రీలంకకు విమాన టిక్కెట్ల ధరలు, కొలంబోలో హోటల్ వంటి వసతి ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ప్రీమియం త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒకరోజుకు డబుల్ బెడ్ రూమ్‌ల ధరలు రూ.1.05 లక్షల నుంచి రూ.1.06 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ లేని సమయాల్లో ఈ ధర రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.
India Pakistan match
cricket world cup
Colombo
flight ticket prices
Pakistan cricket board
India vs Pakistan
Sri Lanka
hotel prices
T20 world cup

More Telugu News