India Pakistan T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్.. కొలంబోకు పెరిగిన విమాన టిక్కెట్ ధరలు

India Pakistan T20 World Cup Colombo Flight Ticket Prices Surge
  • నిమిషాల వ్యవధిలో రూ.10 వేలు పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
  • ముంబై నుంచి కొలంబో రౌండ్ టిక్కెట్ ధరలు సుమారు రూ.60,000
  • ఇతర నగరాల నుంచి కూడా కొలంబోకు పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
కొలంబోలో భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ నేపథ్యంలో ముంబై నుంచి కొలంబోకి రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. నిమిషాల వ్యవధిలో టిక్కెట్ ధరలు సుమారు రూ.10,000 మేర పెరిగాయి. టీ20 ప్రపంచ కప్‌లో కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు తొలుత పాకిస్థాన్ ససేమీరా అన్నది.

తాజాగా యూటర్న్ తీసుకుంది. దీనితో ముంబై-కొలంబో-ముంబై రౌండ్ టిక్కెట్ ధరలు అమాంతం పెరిగి రూ.60,000 వరకు చేరుకున్నాయి. భారత్‌లోని ఇతర నగరాల నుంచి కూడా కొలంబోకు టిక్కెట్ ధరలు పెరిగాయి.

భారత్‌తో తాము మ్యాచ్ ఆడబోమని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు పాకిస్థాన్ సోమవారం ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), శ్రీలంక క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మధ్య గత కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై పునరాలోచన చేయాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. చర్చలు, మిత్రదేశాల విజ్ఞప్తుల నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.

భారత్‌తో మ్యాచ్ ఆడతామని పాకిస్థాన్ ప్రకటించడంతో కొలంబోకు ప్రయాణ, వసతి బుకింగ్‌ల హడావుడి పెరిగింది. దాయాదుల మధ్య మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ నేపథ్యంలో వేలాదిమంది శ్రీలంకకు వస్తారని భావిస్తున్నారు. వసతి కోసం కొలంబోలో హోటల్ ధరలు కూడా పెరిగే అవకాశముంది.
India Pakistan T20 World Cup
T20 World Cup
India vs Pakistan
Colombo
Flight Ticket Prices
Pakistan Cricket Board

More Telugu News