Komatireddy Venkat Reddy: 'యుఫోరియా' చిత్రంపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు

Komatireddy Venkat Reddy Praises Euphoria Movie
  • ఇది వాస్తవికతకు అద్దం పట్టే చిత్రమన్న మంత్రి
  • యువత, తల్లిదండ్రులు తప్పక చూడాలని సూచన
  • హైదరాబాద్ నిజ ఘటనల ఆధారంగా సినిమా రూపకల్పన
  • సాహసోపేత ప్రయత్నమంటూ గుణశేఖర్‌కు అభినందనలు
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన 'యుఫోరియా' చిత్రంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా వాస్తవికతకు అద్దం పడుతోందని, యువతతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తప్పక చూడాల్సిన చిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించారు. "'యుఫోరియా' వాస్తవికతకు నిలువుటద్దం లాంటిది. కీలకమైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన ఈ చిత్రం యువత, తల్లిదండ్రులు తప్పక చూడాలి" అని ఆయన పేర్కొన్నారు. ఈ సాహసోపేత ప్రయత్నం చేసిన దర్శకుడు గుణశేఖర్‌కు, చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.

సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతున్న నేరాల ధోరణి, తల్లిదండ్రుల బాధ్యత వంటి సున్నితమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో భూమికా చావ్లా, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, యుక్త గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, 'యుఫోరియా' చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది.
Komatireddy Venkat Reddy
Euphoria Movie
Gunasekhar
Telangana Cinema
Bhoomika Chawla
Sara Arjun
Youth Crime
Telugu Cinema
Gautham Vasudev Menon
Nassar

More Telugu News