Nandyala: రాత్రి భర్తతో గొడవపడి గదిలోకి వెళ్లిన భార్య.. తెల్లారి చూస్తే తల్లీబిడ్డలు మృతి
- ఆంధ్రప్రదేశ్ లోన నంద్యాలలో విషాదం
- ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న మహిళ
- భర్తను ప్రశ్నిస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్జీవో కాలనీలో ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నంద్యాలలోని లలితా నగర్ కు చెందిన ఉదయ్ కిరణ్ కు, ఎన్జీవో కాలనీకి చెందిన మల్లికకు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఇషాన్ సాయి(2), పరిమిత(7 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా ఉదయ్, మల్లికల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న (శుక్రవారం) రాత్రి కూడా గొడవ జరగడంతో మనస్థాపం చెందిన మల్లిక పిల్లలను తీసుకుని గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుంది.
ఏడుస్తూ పడుకుని ఉంటుందని ఉదయ్ కిరణ్ పట్టించుకోలేదు. తెల్లవారినా తలుపులు తెరవకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టి చూడగా.. మల్లికతో పాటు పిల్లలు ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లలను చంపి మల్లిక ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మల్లిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఉదయ్ కిరణ్ ను విచారిస్తున్నట్లు సమాచారం.