Raviteja: తన కొడుకు కెరీర్ పై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు
- 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ
- తన కొడుకుపై తన ఒత్తిడి ఉండదన్న మాస్ మహరాజా
- ప్రస్తుతం తన కుమారుడు సందీప్ వంగా వద్ద పనిచేస్తున్నాడని వెల్లడి
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ హుషారైన నటన ప్రేక్షకులను అలరిస్తోంది. కథానాయికలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అకట్టుకుంటోంది.
మరోవైపు, ఓ ఇంటర్వ్యూలో రవితేజ తన కుమారుడు మహాధన్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ తన కొడుకుపై ఒత్తిడి తీసుకురాలేదని ఆయన చెప్పారు. "ఇది చేయి, అది చేయి" అని తాను ఎప్పుడూ చెప్పలేదని... వాడి భవిష్యత్తు పూర్తిగా వాడి ఇష్టమని తెలిపారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని, వారు తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని అన్నారు. ప్రస్తుతం తన కొడుకు, దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు ఇద్దరూ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారని వెల్లడించారు. వాళ్ల కెరీర్ ను వాళ్లే నిర్మించుకుంటారని చెప్పారు.