‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..!
- నిబంధనలనేవి వ్యవస్థను మెరుగు పరిచేలా ఉండాలన్న ప్రధాని
- ప్రజలను వేధించేలా కాదని ప్రధాని వ్యాఖ్య
- ఎన్డీయే నేతల సమావేశంలో ప్రధాని సూచనలను వెల్లడించిన మంత్రి రిజిజు
మంగళవారం ఉదయం ఎన్డీయే నేతలతో జరిగిన భేటీలో ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రధాని ప్రస్తావించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనలు వ్యవస్థలను మెరుగుపరిచేలా ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టేలా వుండకూడదని ప్రధాని వ్యాఖ్యానించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మోదీ చెప్పారన్నారు. ‘‘నియమ నిబంధనలు మంచివే.. అయితే, అవి వ్యవస్థలను మెరుగుపరచాలి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు” అని మోదీ అన్నట్లు రిజిజు తెలిపారు.