Vijay Raghavendra: అమెజాన్ ప్రైమ్ లో కన్నడ క్రైమ్ థ్రిల్లర్!

Rippan Swaami Movie Update
  • కన్నడలో రూపొందిన 'రిప్పన్ స్వామి'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి
  • ఈ నెల 11 నుంచి మొదలైన స్ట్రీమింగ్  
  • యాక్షన్ తో మెప్పించిన విజయరాఘవేంద్ర 

కన్నడలో విజయ్ రాఘవేంద్రకి మంది క్రేజ్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఆయన వెళుతున్నాడు. మాస్ ఆడియన్స్ నుంచి ఆయనకి మరిన్ని మంచి మార్కులు తెచ్చిపెట్టే సినిమా ఒకటి రీసెంటుగా థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా పేరే 'రిప్పన్ స్వామి'. రూరల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చింది.

అలాంటి ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అశ్విని చంద్రశేఖర్ - యమున శ్రీనిధి .. ప్రకాశ్ తుమినాడ్ .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కిశోర్ దర్శకత్వం వహించాడు. పంచానన బ్యానర్ పై నిర్మింతమైన ఈ సినిమాకి సామ్యూల్ సంగీతాన్ని సమకూర్చాడు. యాక్షన్ పరంగా విజయ్ రాఘవేంద్రకి మారిన్ని మార్కులను తెచ్చిపెట్టిన సినిమా ఇది. 

మల్నాడ్ ప్రాంతంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకు కారణం  రిప్పన్ స్వామి చనిపోవడం. అతనే షూట్ చేసుకున్నట్టుగా చేతిలో గన్. ఆ దృశ్యాన్ని ఎవరూ నమ్మలేకపోతుంటారు. అందుకు కారణం... రిప్పన్ స్వామి అంటే, కండబలం .. గుండెబలం కలిగినవాడిగా అక్కడ పేరు ఉండటమే. ఆయనంటే అక్కడ అందరికీ హడల్. చివరికీ పోలీసులు సైతం భయపడతారు. అలాంటి ఆయన ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనేదే కథ. ప్రస్తుతం ఈ సినిమా కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. 

Vijay Raghavendra
Rippan Swamy
Kannada movie
Amazon Prime
Crime thriller
Ashwini Chandrasekhar
Rural crime thriller
Kannada cinema
Latest Kannada movies
Kishore directorial

More Telugu News