Vijayawada Hotel Incident: విజయవాడలో రంగారెడ్డి జిల్లా కుటుంబానికి చేదు అనుభవం.. హోటల్లో యువతి స్నానం చేస్తుండగా వీడియో

Vijayawada Hotel Incident Rangareddy Family Faces Bad Experience
  • గవర్నర్‌పేటలోని ఒక హోటల్‌లో బస చేసిన కుటుంబం
  • 303 నెంబర్ గదిలో యువతి స్నానం చేస్తుండగా పక్క గది వెంటిలేటర్ నుంచి వీడియో తీసిన వ్యక్తి
  • యువతి అరవడంతో పట్టుకోవడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులు
  • గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు
విజయవాడలో ఒక తెలంగాణ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక కుటుంబం గత నెల 26న విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చింది. గవర్నర్‌పేటలోని ఒక హోటల్‌లో వారు బస చేశారు. ఆ కుటుంబానికి చెందిన ఒక యువతి స్నానం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు.

హోటల్‌లోని 303 నెంబర్ గదిలో ఉదయం యువతి స్నానం చేస్తుండగా, ప్రక్కనే ఉన్న 304 నెంబర్ గదిలోని వెంటిలేటర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. వీడియో తీస్తున్నట్టు గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకి చేరుకొని ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.

అయితే, ఆ వ్యక్తి అక్కడి నుండి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం గత నెల 29న గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Vijayawada Hotel Incident
Vijayawada
Hotel Video Recording
Rangareddy District
Andhra Pradesh Crime

More Telugu News