అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్యలో తగ్గుదల
- గతేడాదితో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తున్న తగ్గిన పర్యాటకుల సంఖ్య
- ట్రంప్ కఠిన వీసా నిబంధనలే కారణం
- స్టడీ వీసాల విషయంలో ట్రంప్ ఆంక్షలతో విద్యార్థుల విముఖత
అమెరికా టూరిజం శాఖ గణాంకాల ప్రకారం.. గతేడాది జూన్ లో 2.3 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు. ఈ ఏడాది జూన్ లో పర్యాటకుల సంఖ్య 8 శాతం తగ్గి, 2.1 లక్షలుగా నమోదైంది. జులైలోనూ 5.5 శాతం తగ్గుదల నమోదైంది. ట్రంప్ వీసా ఆంక్షల నేపథ్యంలో అమెరికాకు అంతర్జాతీయ ప్రయాణికుల రాక తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం సందర్శకుల్లో అమెరికాయేతర పౌరల రాక జూన్‌లో గతేడాదితో పోలిస్తే 6.2 శాతం తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రంప్ కఠిన వీసా నిబంధనలు బెడిసికొట్టాయని భావించాల్సి ఉంటుందని అమెరికా పర్యాటక రంగం దిగ్గజ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.