ఈ ఆడియో నాది కాదు... ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే క్షమించాలి: ఎమ్మెల్యే ప్రసాద్
- జూనియర్ ఎన్టీఆర్‌పై దూషణల ఆడియో కలకలం
- టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు
- స్పందించిన అనంతపురం ఎమ్మెల్యే
- ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని స్పష్టీకరణ
- స్థానిక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ప్రచారం అని ఆరోపణ
ఈ వివాదంపై దగ్గుపాటి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. "సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియో రికార్డు నాది కాదు. స్థానిక రాజకీయాల్లో భాగంగా కొందరు నాపై కుట్ర పన్నారు. నాకు చిన్నప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబాల పట్ల ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి," అని ఆయన వివరించారు.
ఈ ఆడియో వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే, తన తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన వినమ్రంగా తెలిపారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన కోరారు.