ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రామ్‌గోపాల్ వర్మ
- 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోల మార్ఫింగ్
- గతేడాది నవంబర్ 10న ఆర్‌జీవీపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఒంగోలు రూరల్ పోలీసుల నోటీసులు
'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ కించపరిచినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై గతేడాది నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న వర్మ విచారణకు వచ్చారు. మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు మళ్లీ ఆయన విచారణకి హాజరయ్యారు. ఆర్‌జీవీని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు ప్రశ్నిస్తున్నారు.