మృతుల సంఖ్యపై సిగాచి అధికారిక ప్రకటన
- 90 రోజుల పాటు కంపెనీ మూసివేత
- బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ
- పేలుడుకు రియాక్టర్ కారణం కాదన్న కంపెనీ సెక్రటరీ
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ రోజు ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సిగాచి పాశమైలారం ప్లాంటును 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.