మహానాడుకు రమ్మంటూ అన్నగారి పిలుపు.. వీడియో ఇదిగో!
--
‘ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగుజాతిని ఏకం చేయడానికి, తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీలలో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను.. ’ అంటూ ఈ వీడియో సాగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.