Vadakkan: డిఫరెంట్ కాన్సెప్ట్ తో షేక్ చేస్తున్న 'వడక్కన్'

Vadakkan Movie Update
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో సినిమాలకు సంబంధించి ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో .. తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో బలమైన కథను చెప్పడంలో అక్కడి దర్శకులు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో 'వడక్కన్' ఒకటిగా కనిపిస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది.

కిశోర్ - శృతి మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సాజీద్ దర్శకత్వం వహించాడు. రసూల్ పూకుట్టి ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఉత్తర మలబార్ ప్రాంతంలో చాలా ప్రాచీన కాలానికి సంబంధించిన జానపద కథలు వినిపిస్తూ ఉంటాయి. ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రకారం ఈ సినిమా నడుస్తుంది. కంటెంట్ ఒక రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. 'భ్రమయుగం' వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకులు మొదలు, అందరూ ఈ చిత్ర దర్శకుడిని అభినందిస్తున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

Go Back to Shorts
Vadakkan
Malayalam Movie
Amazon Prime
Kishore
Shruti Menon
Sajid
Rassul Pookutty
OTT Release
Malayalam Cinema
Folklore

More Telugu News