శ్రీవిష్ణుకి మరో హిట్ పడినట్టేనా?

Singel Movie Update
శ్రీ విష్ణు తాజా చిత్రంగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు 'సింగిల్' వచ్చింది. టీజర్ .. ట్రైలర్ జనంలోకి వచ్చేంతవరకూ పెద్దగా బజ్ లేదు. అయితే ఆ తరువాత కొన్ని వివాదాస్పదమైన అంశాలు అందరి దృష్టినీ ఈ సినిమా వైపుకు మళ్లించాయి. దానికి తోడు చాలా కాలం తరువాత ఒకేసారి హాట్ బ్యూటీలను తెరపై చూసే అవకాశం కూడా ఈ సినిమాతో కలిగింది. ఏదైతేనేం ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే పడ్డాయి. 

శ్రీవిష్ణుకి సరైన హిట్ పడి చాలాకాలమే అయింది. అందువలన గట్టి హిట్ ఒకటి పడాల్సిందే అనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 'సింగిల్' తో ఆయనకి హిట్ పడినట్టేనా? అనే ప్రశ్న రేజ్ అవుతోంది. థియేటర్ రెస్పాన్స్ అందుకు సమాధానంగా కనిపిస్తోంది. అందుకు అవసరమైన అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. కథ పాతదే అయినా ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు. మేకింగ్ క్వాలిటీ విషయంలో మరింత శ్రద్ధ పెట్టవలసిందనీ అంటున్నారు. 

ఈ మధ్య కాలంలో సినిమాలలో కమెడియన్స్ చాలామంది కనిపిస్తున్నారు .. కానీ కామేడీనే కనిపించడం లేదు. అలా కాకుండా ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. కొన్ని సినిమాలలో కథ .. మరికొన్ని సినిమాలలో కథనం .. పాటలు ఆ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. అలా చూసుకుంటే సంభాషణలు .. సన్నివేశాలు ఈ సినిమాను సక్సెస్ దిశగా నడిపించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 


Go Back to Shorts
Sri Vishnu
Single Movie
Telugu Cinema
Tollywood
Box Office
Movie Review
Telugu Film
Hit Movie
Telugu Film Industry

More Telugu News