ఆ సినిమా నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది: అల్లు అర్జున్

21 Years of Arya Allu Arjuns Emotional Tribute
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిన 'ఆర్య' చిత్రం గురించి భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలై 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, 'ఆర్య' కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక అద్భుత ప్రయాణానికి అది నాంది పలికిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్య చిత్రం 2004 మే 7న రిలీజైంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ పోస్టు పెట్టారు. "ఆర్య కేవలం ఒక చిత్రం కాదు. నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక ప్రయాణానికి అది ఆరంభం. ఆ సినిమాతో ముడిపడిన ప్రేమ, మధుర జ్ఞాపకాలు, అప్పటి మ్యాజిక్ ఇప్పటికీ సజీవంగా ఉన్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడను" అని తెలిపారు. #21YearsForArya హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ మేరకు ఆర్య వర్కింగ్ స్టిల్స్ ను కూడా పోస్టు చేశారు.

'ఆర్య' చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా ద్వారానే ఆయన యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం, అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో బన్నీ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు యువతను ఓ ఊపు ఊపాయంటే అతిశయోక్తి కాదు.
Go Back to Shorts
Allu Arjun
Arya Movie
Sukumar
Tollywood
Telugu Cinema
Anniversary
21 Years of Arya
Anu Mehta
Devi Sri Prasad
Box Office Success

More Telugu News