Telangana Intermediate Board: రేపు మధ్యాహ్నం తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!

Telangana Inter Results Date Time  How to Check
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను మంగళవారం (ఏప్రిల్ 22న) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాల పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.
Go Back to Shorts
Telangana Intermediate Board
Intermediate Exam Results
Krishna Aditya
Mallu Bhatti Vikramarka
Ponnam Prabhakar
TG Board of Intermediate Education
Intermediate Results 2024
Manabadi Inter Results
Telangana Inter Results
tgbie.cgg.gov.in

More Telugu News