అనిల్ కుంబ్లేతో డీకే శివకుమార్ మంతనాలు.. రాజకీయాల్లో చేరుతున్నాడా?
దీనికి కుంబ్లే కూడా స్పందించాడు. తనను కలిసేందుకు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, ఈ సమావేశం వెనకున్న కారణాలు తెలియరాలేదు. మరోవైపు, ఇద్దరి కలయికపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కుంబ్లేను డీకే రాజకీయాల్లోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే, కుంబ్లే మాత్రం ఇది వ్యక్తిగత సమావేశమని కొట్టి పడేశాడు.