‘విశ్వంభ‌ర’ నుంచి మెగా అప్‌డేట్‌.. ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘విశ్వంభ‌ర’ నుంచి మెగా అప్‌డేట్‌.. ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Vishvambhara First Single Release Date Announced
  • చిరంజీవి, వశిష్ట కాంబోలో ‘విశ్వంభ‌ర’ 
  • ఏప్రిల్ 12న ‘రామ రామ’ అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌
  • బాల హ‌నుమాన్‌ల‌తో చిరు ఉన్న కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్న మేక‌ర్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్రం యూనిట్‌ ప్ర‌క‌టించింది. ‘రామ రామ’ అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా బాల హ‌నుమాన్‌ల‌తో చిరు ఉన్న కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ పంచుకున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత‌ ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక గ‌తేడాది ద‌స‌రా కానుక‌గా ‘విశ్వంభ‌ర’ టీజ‌ర్‌ విడుద‌ల కాగా... మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. 


Advertisement
Chiranjeevi
Vishvambhara
First Single Release Date
UV Creations
MM Keeravaani
Trisha
Telugu Movie
Social Fantasy
Tollywood
April 12th

More Telugu News