Chiranjeevi: ‘మెగా 157’ సినిమాకు పనిచేస్తున్నది వీళ్లే.. వీడియో ఇదిగో!

Mega157 Cast and Crew Revealed in New Video
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ 157 చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘మెగా 157’ పేరు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. మెగా 157 సినిమాకు పనిచేస్తున్న కీలకమైన వ్యక్తులతో మెగాస్టార్ ఇంటరాక్ట్ అయినట్లు చూపుతూ ఈ వీడియోను ప్రత్యేకంగా తయారు చేశారు. 

ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. చిరంజీవి నటించిన సినిమాల్లోని పాత్రలను చెబుతూ ఒక్కొక్కరు వారు చేయనున్న వర్క్‌ను వివరించడం ఈ వీడియోలో కనిపించింది. ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ మెగాస్టార్ చెప్పిన నేపథ్యంలో 2026 సంక్రాంతికి విడుదల చేసేలా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసేందుకు చిత్ర బృందం పనిచేస్తున్నట్లు సమాచారం.

Go Back to Shorts
Chiranjeevi
Mega157
Anil Ravipudi
Telugu Movie
Tollywood
Chiranjeevi Movie
Upcoming Telugu Film
Mega Star Chiranjeevi
2026 Sankranthi Release

More Telugu News