మరో మ్యాచ్ కు సిద్ధమైన చెన్నై సూపర్ కింగ్స్... రాజస్థాన్ రాయల్స్ తో ఢీ

Chennai Super Kings vs Rajasthan Royals IPL Clash in Guwahati
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • రెండో మ్యాచ్ లో సీఎస్కే × ఆర్ఆర్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
ఐపీఎల్ లో నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు గువాహతి వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు సీఎస్కే రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ తాను ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. 

నేటి మ్యాచ్ కోసం చెన్నై జట్టులో రెండు మార్పులు చేశారు. శామ్ కరన్ స్థానంలో జేమీ ఒవెర్టన్, దీపక్ హుడా స్థానంలో విజయ్ శంకర్ లకు స్థానం కల్పించారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి మార్పలు లేకుండా బరిలో దిగుతోంది.
Advertisement
Chennai Super Kings
Rajasthan Royals
IPL 2024
Guwahati
CSK vs RR
Vijay Shankar
Jamie Overton
Cricket Match
IPL

More Telugu News