పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు: సీసీ టీవీ ఫుటేజి విడుదల చేసిన పోలీసులు
- అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్
- రోడ్డు పక్కన విగతజీవుడిగా కనిపించిన వైనం
- దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ పోలీసులు
ఇవాళ ఐజీ అశోక్ కుమార్ రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రవీణ్ జాతీయ రహదారిపై ప్రయాణించిన సీసీ టీవీ ఫుటేజిని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ విడుదల చేశారు. నేషనల్ హైవేపై పలు టోల్ గేట్ల మీదుగా ప్రవీణ్ ప్రయాణించిన విజువల్స్ అందులో ఉన్నాయి. ఓ చోట ప్రవీణ్ వెనుకగా వెళ్లిన నాలుగు కార్లకు ఈ ఘటనతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.