Velagapudi Ramakrishna Babu: ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

Rama Naidu Studio Land Issue in AP Assembly
షార్ట్స్‌లో చూడండి
సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా కొంత భూమిని లేఅవుట్లు వేసి విక్రయించే ప్రయత్నాలు జరిగాయి.

ఆ నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు న్యాయపోరాటం ద్వారా లేఅవుట్ విక్రయాలను నిలుపుదల చేయించారు. తాజాగా ఆయన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు.

ఈ స్టూడియో నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం 35 ఎకరాలను కేటాయించగా, అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని స్టూడియో కోసం వినియోగించలేనందున ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. 
Go Back to Shorts
Velagapudi Ramakrishna Babu
AP Assembly
Rama Naidu Studios
Visakhapatnam
Land Allotment
Studio Land
Andhra Pradesh Government
Real Estate
TDP MLA

More Telugu News