పవన్ కల్యాణ్ పై యాంకర్ శ్యామల విమర్శలు
- కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోందన్న శ్యామల
- సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ స్పందించడం లేదని విమర్శ
- తన వ్యాఖ్యలు రాజకీయపరమైనవి కావన్న శ్యామల
ఈరోజు కాశినాయని క్షేత్రానికి తాను వచ్చానని... ఈ క్షేత్రంపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఉండలేక వచ్చానని శ్యామల తెలిపారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పుకునే పిఠాపురం పీఠాధిపతి పవన్ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు రాజకీయపరమైనవి కావని... ఒక సామాన్య వ్యక్తిగానే తాను స్పందిస్తున్నానని చెప్పారు.