విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్న 'కన్నప్ప'
- ఆది నుంచి 'కన్నప్ప'కి తప్పని విమర్శలు
- తాజాగా మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన టీమ్
- కోయ నేపథ్యానికి సంబంధం లేని సాహిత్యం
- యాసకి దూరంగా సాగిన పాట
ఈ నేపథ్యంలో వదిలిన 'శివశివశంకర .. ' పాటలో, కన్నప్ప తనకి అందుబాటులో ఎలాంటి పాత్ర లేకపోవడం వలన నోట్లో నీళ్లు పోసుకుని శివలింగాన్ని అభిషేకిస్తాడు. ఆ తరువాత షాట్ లోనే మట్టిపాత్రలో దుప్పి మాంసం నైవేద్యం పెట్టినట్టు చూపించడం విస్మయం కలిగించింది. ఇక రీసెంటుగా 'కన్నప్ప' నుంచి 'సగమై చెరిసగమై' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను వదిలారు. మొదటి పాట మాదిరిగానే ఈ పాట కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోయింది.
" కోయగూడానికి చెందిన భార్యాభర్తలు ఆ యాసలోనే పాటలు పాడుకుంటారు .. గతంలో వచ్చిన 'భక్త కన్నప్ప'లోని పాటలు ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఆ సహజత్వమే. కానీ ఈ పాటలో కన్నప్ప పాత్రకి 'ఇరు పెదవుల శబ్దం .. విరి ముద్దుల యుద్ధం' అనే ప్రయోగం చేశారు. ఇది ఒక సాధారణ యువతీ యువకులు పాడుకునే పాట మాదిరిగానే ఉందిగానీ, కోయగూడానికి చెందిన ఆలుమగలు పాడుకునే పాటలా లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ పాటలో హీరోయిన్ పెదవులపై కన్నప్ప ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయడం కొసమెరుపు.