పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు
- చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని
- రాష్ట్రవ్యాప్తంగా 17 కేసుల నమోదు
- ఆదోనిలో నమోదైన కేసులో ఈ నెల 18 వరకు రిమాండ్
- కర్నూలు జిల్లా కోర్టుకు తరలింపు
ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.