వల్లభనేని వంశీ భార్య వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
- వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించిన పోలీసులు
- పోలీసు వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చిన వంశీ భార్య
- నందిగామ వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
తాము నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళుతున్నామని, ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుందని, తమను అనుసరించవద్దని ఆమెకు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైవింగ్ స్కూల్ లో ఆమెను ఉంచారు. ఆమె ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.