నేడు ఢిల్లీకి చంద్రబాబు .. ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
- ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేయనున్న చంద్రబాబు
- తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఎన్డీయే భాగస్వామిగా ఆయన బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో పర్యటించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు కూటమి ఎంపీలను ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇటీవల ఉండవల్లిలో జరిగిన ఎంపీల సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. ఓట్ల లెక్కింపును 8వ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.