ఐదేళ్లలో మూడుసార్లు పేపర్ లీక్ అయింది: బీజేపీపై అన్నామలై ఆగ్రహం
- నీట్‌కు మద్దతిచ్చినప్పటికీ, ఇప్పుడు జవాబుదారీతనం కోరుతున్నానన్న అన్నామలై
- విద్యార్థులతో చర్చలు జరపడంలో ప్రభుత్వ జాప్యాన్ని ప్రశ్నించిన అన్నామలై
- నిరసనలు ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని వ్యాఖ్య
నీట్ ప్రవేశ పరీక్షకు తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ఇన్నాళ్లూ ఆ విధానానికి అండగా నిలిచిన బీజేపీ మాజీ నేత కె. అన్నామలై ఇప్పుడు ఈ విషయంలో జవాబుదారీతనం కోరుతున్నారు. పదేపదే ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకోవడంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు రావడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు.
గతంలో తాను నీట్ పరీక్షకు ఎందుకు మద్దతు పలికారో అన్నామలై ఈ సందర్భంగా వివరించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల ఎంపికలో ఏకరూపత ఉంటుందని, తద్వారా పేద, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా వైద్యులు కావాలనే తమ కలను నెరవేర్చుకునేందుకు సమాన అవకాశాలు లభిస్తాయని తాను విశ్వసించినట్లు పేర్కొన్నారు.
"గత ఐదేళ్ల కాలంలో నీట్ యూజీ ప్రశ్నపత్రం మూడుసార్లు లీక్ అయింది. దీనివల్ల విద్యార్థులు ఎంతటి తీవ్ర ఒత్తిడికి లోనవుతారో ఊహించండి. వ్యవస్థలో ఏకరూపత తీసుకురావాల్సిన యంత్రాంగమే విఫలమవుతున్నప్పుడు, అక్కడ జవాబుదారీతనం శూన్యమైంది. ఈ వైఫల్యమే విద్యార్థులను ఆందోళనల బాట పట్టేలా చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను" అని అన్నామలై స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని గుర్తుచేసిన ఆయన, విద్యార్థులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేసిందని ప్రశ్నించారు. "నిరసనలు ఉధృతమయ్యే వరకు ఎందుకు వేచి చూశారు? మిమ్మల్ని అడ్డుకున్న శక్తులు ఏవి?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే సమయంలో, స్వార్థ ప్రయోజనాలు ఆశించే శక్తులు తమ ఉద్యమాన్ని పక్కదారి పట్టించకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులతో చర్చలు జరిపి, పారదర్శకతతో వారి ఆందోళనలను నివృత్తి చేసేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని అన్నామలై కోరారు. "మన వ్యవస్థలపై యువతకు నమ్మకం సడలితే, అది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం" అని ఆయన హెచ్చరించారు.