ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా దళాలు.. హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత!
- ఇరాన్ సైనిక లక్ష్యాలపై కొనసాగుతున్న వైమానిక దాడులు
- ఇరాన్ మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరిక
- చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకుంటామన్న ఇరాన్ సైన్యం
- అమెరికాలోని 68 శాతం మంది ప్రజలు ఇరాన్‌తో యుద్ధానికి వ్యతిరేకం
- జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సరిహద్దు ప్రాంతాల్లోకి విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన నేపథ్యంలో, ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ప్రాంతీయ జలాల్లో ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను పూర్తిగా అణచివేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే ఏ నౌకపైనైనా ఇరాన్ క్షిపణులు, రాకెట్లు లేదా డ్రోన్లతో దాడులు చేస్తే, దానికి నిరసనగా ఇరాన్‌లోని లేదా రాజధాని టెహ్రాన్ సమీపంలోని ఒక వంతెనను లేదా పవర్ ప్లాంట్‌ను అమెరికా బాంబులతో పూర్తిగా ధ్వంసం చేస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రధాన సైనిక విభాగం ఖాసిమ్ అల్-అన్బియా తీవ్రంగా మండిపడింది. అమెరికా తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే, పశ్చిమాసియా నుంచి జరిగే చమురు ఎగుమతులన్నింటినీ పూర్తిగా అడ్డుకుంటామని, ప్రాంతీయ ఇంధన, విద్యుత్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. అమెరికా చర్యలు యుద్ధాన్ని మరింత విస్తరింపజేస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్‌తో ఈ యుద్ధం అనవసరమని, దీనికి మద్దతు ఇవ్వలేమని 68 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడినట్లు వాషింగ్టన్ పోస్ట్ సర్వే పేర్కొంది. ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పరాకాష్ఠకు చేరడంతో బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో ప్రమాద హెచ్చరికగా సైరన్లు మోగాయి.