యడ్యూరప్ప బెయిల్ పొడిగించిన కర్ణాటక హైకోర్టు
- 17 ఏళ్ల అమ్మాయిని వేధించిన ఘటనలో యడ్యూరప్పపై పోక్సో కేసు
- ట్రయల్ కోర్టు హాజరు నుంచి యడ్యూరప్పకు హైకోర్టు మినహాయింపు
- కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా
2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో తన 17 ఏళ్ల కూతురుని యడ్యూరప్ప వేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. ఫిర్యాదు చేసిన మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించింది. కాగా యడ్యూరప్పను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని కోరుతూ బాధితురాలి సోదరుడు జూన్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు.