నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు చంద్రబాబు కుటుంబం కానుకలు
- సంక్రాంతి వేడుకల్లో నారా, నందమూరి కుటుంబాలు
- వివిధ పోటీలతో సందడిగా నారావారిపల్లె
- పోటీలను తిలకించిన చంద్రబాబు దంపతులు
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలను కూడా చంద్రబాబు దంపతులు తిలకించారు.