పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
- 2023లో వీరసావర్కర్‌ను ఉద్దేశించి లండన్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
- పరువు నష్టం కేసు వేసిన సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్
- రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై రాహుల్ గాంధీకి బెయిల్
ఈ కేసుకు సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయనకు రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టుకు హాజరయ్యారు.