ఓటీటీలోకి అడుగుపెడుతున్న 'రజాకార్'
- క్రితం ఏడాది మార్చిలో వచ్చిన 'రజాకార్'
- ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ
- ఆలస్యంగానే ఓటీటీకి వచ్చిన సినిమా
- ఈ నెల 24వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్
అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై అడుగుపెడుతుందా అని చాలా కాలంగా చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లకు రావడానికే అనేక అవాంతరాలను దాటవలసి వచ్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా అలాంటి పరిస్థితినే ఎదురైంది. ఆటంకాలను దాటుకుని, ఈ నెల 24వ తేదీన ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు కూడా.
ఆనాటి అమానుష శక్తిగా చెప్పుకునే 'రజాకార్' సాగించిన అరాచకాన్ని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన కంటెంట్ ఇది. నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఇంద్రజ .. అనసూయ .. బాబీ సింహా .. రాజ్ అర్జున్ ప్రధానమైన పాత్రలను పోషించారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.