ఎయిర్ ఇండియా ప్రయాణికులకు శుభవార్త.. విమానాల్లో ఇక వైఫై సేవలు
- 10 వేల అడుగున ఎత్తున కూడా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే వీలు
- ఈ సేవలు తీసుకొస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డు
- తొలుత అంతర్జాతీయ రూట్లలో అందుబాటులోకి
- ఆ తర్వాత దేశీయ విమానాల్లో సేవలు
విమానంలో అందుబాటులోకి వచ్చే వైఫై సేవలతో ల్యాప్‌టాప్స్, ట్యాబ్‌లెట్స్, స్మార్ట్‌ఫోన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 10 వేల అడుగుల ఎత్తున కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఎయిర్‌బస్ ఏ350, ఎయిర్‌బస్ ఏ321 నియో, బోయింగ్ 787-9 వంటి న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత దశలవారీగా దేశీయ విమానాల్లో వైఫై సేవలు ప్రారంభిస్తారు.