యుద్ధ విరామంతో దిగొచ్చిన చమురు ధరలు.. ఒక్కరోజే 7 శాతం పతనం
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత తగ్గడంతో చమురు ధరల పతనం
- బ్రెంట్, డబ్ల్యూటీఐ ధరలు ఏడు శాతం వరకు తగ్గుదల
- దౌత్యపరమైన పరిష్కారంపై మార్కెట్‌లో ఆశలు
- ఇంకా పూర్తిగా తొలగని సరఫరా అంతరాయ భయాలు
- చమురు పతనంతో రూపాయికి భారీ ఊరట
అమెరికా-ఇరాన్ మధ్య వారాంతంలో సైనిక దాడులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం భారీగా తగ్గాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా ఏడు శాతం మేర పడిపోగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు కూడా ఏడు శాతం వరకు తగ్గింది. దీంతో గత మూడు వారాలుగా కొనసాగిన భారీ ర్యాలీకి తాత్కాలిక బ్రేక్ పడింది.
ఇరాన్ ఇకపై అమెరికా దాడులు జరగనంత వరకు తాము కూడా దాడులకు దిగబోమని సంకేతాలు ఇవ్వడంతో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు మార్కెట్‌లో పెరిగాయి. దీంతో బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు సుమారు 91 డాలర్ల వద్దకు, డబ్ల్యూటీఐ ధర 85 డాలర్ల దిగువకు చేరింది. గత వారంలో హర్మూజ్, బాబ్ ఎల్ మండెబ్ జలసంధుల్లో సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుందనే భయంతో బ్రెంట్ ధర 100 డాలర్ల మార్కును దాటిన విషయం తెలిసిందే.
అయితే ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎర్ర సముద్రంలోని సౌదీ అరామ్‌కో చమురు కేంద్రాలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. హర్మూజ్ జలసంధి మీదుగా రవాణా కూడా ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని గుర్తుచేస్తున్నారు.