జోగి రమేశ్ తో పరిచయం లేదు.. పేర్ని నానికి శిక్ష తప్పదు: కొనకళ్ల నారాయణ
- విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జోగి రమేశ్ వస్తున్నట్టు తనకు సమాచారం లేదన్న కొనకళ్ల
- పార్టీకి ద్రోహం చేసే పని చేయనని వ్యాఖ్య
- పేదల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శ
ఈ నేపథ్యంలో కొనకళ్ల నారాయణ స్పందిస్తూ... జోగి రమేశ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై చంద్రబాబును కలిసి వివరిస్తానని చెప్పారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడూ చేయనని... ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, అనుకోకుండా జరిగిందని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకే తాను వెళ్లానని... జోగి రమేశ్ తో తనకు ఎలాంటి పరిచయాలు లేవని తెలిపారు. జోగి రమేశ్ వస్తున్నట్టు తనకు సమాచారం లేదని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదనే ఉద్దేశంతోనే జోగి రమేశ్ వచ్చినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.
రేషన్ బియ్యం మాయం అయిన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని శిక్ష అనుభవించక తప్పదని నారాయణ చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని దోచుకుతున్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. పక్కదారి పట్టిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుంచి బయటపడలేరని చెప్పారు.