విశాఖలో విమానాల దారిమళ్లింపు
- ఎయిర్ పోర్టును కమ్మేసిన పొగమంచు
- వెలుతురు సరిగా లేకపోవడంతో నిర్ణయం
- ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సూచన
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఉదయంపూట పొగమంచు ఎక్కువగా ఉండడంతో స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడంలేదని, ఉదయంపూట కూడా హెడ్ లైట్లు ఆన్ చేసుకుని వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. హెడ్ లైట్స్ ఆన్ చేసినా వాహనాలు మరీ దగ్గరికి వచ్చే వరకూ కనిపించడంలేదని చెప్పారు.