ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలి: పవన్ కల్యాణ్
- ప్రభుత్వ భూముల ఆక్రమణ, బలవంతపు భూసేకరణలపై పవన్ కు అనేక ఫిర్యాదులు
- ఫిర్యాదులపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్
- తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడి
ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఫిర్యాదులపై ప్రాధాన్యతను ఇస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఈ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్థులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.