నేనేమీ పారిపోలేదు.. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చానంతే: నటి కస్తూరి

Actress Kasthuri Released Video Before Arrest
షార్ట్స్‌లో చూడండి
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన తమిళ నటి కస్తూరి అంతకుముందు ఓ వీడియోను విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తానెక్కడికీ పారిపోలేదని, ఎలాంటి భయం లేదని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తన ఇంట్లోనే ఉన్నానని, షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. రోజూ షూటింగ్‌కు వెళ్లి వస్తున్నానని, తన సెల్‌ఫోన్‌ను న్యాయవాదికి ఇచ్చానని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ వీడియోలో కస్తూరి పేర్కొన్నారు.

ఇంతకీ కేసేంటి? 
ఈ నెల 3న హిందూ మక్కల్ కట్చి తరపున చెన్నైలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న కస్తూరి తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర స్త్రీలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. అఖిల భారత తెలుగు సమ్మేళనం ఫిర్యాదుతో ఎగ్మూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు కోసం సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో ఆమె పరారీలో ఉన్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె కోసం గాలించిన పోలీసులు శనివారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చెన్నై తరలించారు. ఎగ్మూర్ కోర్టు ఆమెకు ఈ నెల 29 వరకు రిమాండ్‌ విధించడంతో పుళల్ జైలుకు తరలించారు.
Go Back to Shorts
Actress Kasthuri
Telugu People
Egmore Court
Chennai

More Telugu News